- Advertisement -
నెక్ట్స్ ఎవరు..?
Who is next?
కాగా బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు నలుగురు తప్ప మిగతా అందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని, రేవంత్ రెడ్డి త్వరలో మరో సిక్స్ కొట్టబోతున్నాడని కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ సిక్స్ లో గంటల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వగా.. తదుపరి పార్టీలోకి చేరబోయే ఎమ్మెల్యే ఎవరా..? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫామ్ హౌజ్ కి పిలిచి చెప్పినా పార్టీ నేతలు మాట వినకుండా బీఆర్ఎస్ ను వీడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత దిక్కు తోచని స్థితిలో ఉన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఫిరాయింపులు ఇలాగే కొనసాగితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కష్టంగా మారే అవకాశం ఉందని పార్టీ క్యాడర్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -



