Saturday, March 14, 2026

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

- Advertisement -

గుంటూరు జిల్లా చేబ్రోలులోని కొత్తరెడ్డిపాలేనికి చెందిన 8వ తరగతి విద్యార్థిని శైలజ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

Girl died in suspicious condition

బాలిక అదే గ్రామంలోని గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. ఆమె మెడపై గాయాలు కనబడటంతో హత్యకు గురై ఉండొచ్చని భావిస్తున్నారు. శైలజ, ఆమె అన్నయ్య సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లారు. బడి ముగియగానే బాలుడొక్కడే ఇంటికి తిరిగివచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను అడిగాడు. ఒంట్లో బాగోలేదని మీ చెల్లి మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు వారు చెప్పారు. దీంతో తల్లీ కుమారుడు కలిసి ఊళ్లో వెతికారు. ఆ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్ నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి చెప్పులు ఉండటాన్ని బాలిక అన్న గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగతజీవిగా కనిపించింది. విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు ఇంటి తాళం పగలగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు బాలికను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బంధువులు బాలిక మృతికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఆమెను ఒంటరిగా బయటకు పంపిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజుకు పెళ్లయినా.. మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాలిక తల్లిదండ్రులు నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్