వ్యవసాయం దండగ కాదు పండగ

- Advertisement -

  తెలంగాణలో వ్యవసాయం దండగ కాదు పండగ: సీఎం రేవంత్ రెడ్డి

Agriculture is a festival not a festival

హైదరాబాద్:జులై 18
నేటి నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి దశలో సాయంత్రం 4 గంటలకు రూ.లక్ష వరకు రుణాలు ఉన్న 11.42 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా రూ.7 వేల కోట్లు జమ చేయ నుంది.

ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశాయి. వ్యవసాయ శాఖ కార్యాలయంలో అధికారు లు ట్రయల్న్ కూడా నిర్వహించారు.

ఇవాళ సాయంత్రం 4 గంటలకు రుణమాఫీకి గడువు విధించిన ప్రభు త్వం.. ప్రక్రియ పూర్తికాగానే రైతుల వేదికల వద్ద వ్యవ సాయం దండగ కాదు పండగల సంబురాలు నిర్వహించాలని నిర్ణయించింది.

రుణమాఫీ నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఆన్‌లైన్ ద్వారా రైతులతో మాట్లాడ నున్నారు.అనంతరం రైతువేదికలో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి వేడుకలు నిర్వ హిస్తారు.

ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రతి గ్రామం నుంచి రైతుల ను తరలించేందుకు ఏర్పా ట్లు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆయా నియోజ కవర్గాల్లో రుణమాఫీ ప్రచారంలో పాల్గొంటారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular