రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

- Advertisement -

తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
మూడురోజుల పాటు పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ

Heavy to very heavy rains for next five days

హైదరాబాద్ జూలై 18
;తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు మూడురోజుల పాటు పలు జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది. అలాగే, వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని.. రాబోయే రెండుమూడు రోజుల్లో బలపడి వాయువ దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular