పంచాయితీ ఎన్నికలు…
నిర్వహించేందుకు కాంగ్రెస్.. అడ్డుకొనేందుకు టీఆర్ఎస్
హైదరాబాద్, జూలై 29
Congress to organize.. TRS to prevent
రేవంత్ ఇంత హడావిడిగా ఎన్నికలు ఎందుకు జరపాలని అనుకుంటున్నారు? ప్రతిపక్షాలను ఇరుకున పెట్టి తాను లబ్ది పొందేందుకేనా అని అనుకుంటున్నారంతా. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వీడతారో అని అగ్ర నేతలు తలలు పట్టుకుంటున్నారు. . త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అంటున్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్ వంటి అంశాల జోలికి వెళ్లకుండా గతంలో మాదిరిగానే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరానికి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. అందుకే ఈ సారికి కులగణన, బీసీ రిజర్వేషన్ల ను టచ్ చేయకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.కనీసం జిల్లా స్థాయి ఇన్ ఛార్జిలు కూడా దొరకడమే కష్టమైపోతోంది బీఆర్ఎస్ కు. పార్టీ మారం అని ఖచ్చితంగా చెప్పిన నేతలే మర్నాడు కండువా మార్చేస్తున్నారు. క్షేత్ర స్థాయి నేతలలో తీవ్ర నిరుత్సాహం నెలకొని ఉంది. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ స్థానిక పోరుకు సంసిద్ధంగా లేదన్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీది మరో చిత్రమైన పరిస్థితి. అసెంబ్లీ లో ఎనిమిది, పార్లమెంట్ లో ఎనిమిది సీట్లు అనూహ్యంగా సాధించిన బీజేపీ సర్కార్ వచ్చే ఎన్నికలలో అధికార పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే యోుచనలో ఉంది. అయితే మొన్నటి పార్లమెంట్ బడ్జెట్ తర్వాత తెలంగాణ బీజేపీ నేతలు డైలమాలో పడ్డారు. ఎనిమిది మంది ఎంపీలు , ఇద్దరు కేంద్ర స్థాయి మంత్రులు ఉండి కూడా తెలంగాణకు నిధులు,ప్రాజెక్టులు రాబట్టలేకపోయారని ట్రోలింగులు ఎదుర్కొంటున్నారు. ఇదే అంశాన్ని తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి బీజేపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో ఇదే అంశాన్ని హైలెట్ చేస్తే బీజేపీ పై వ్యతిరేకత పెంచేలా చెయ్యవచ్చని భావిస్తున్నారు. అందుకే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సాధ్యమైనంత తొందరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ జరిపిస్తే కాంగ్రెస్ కు ఎదురే లేదని చెప్పవచ్చు. ఫలితాలను చూపించి అధిష్టానం దృష్టిలో తన సత్తా ఏమిటో నిరూపించుకోవచ్చఇప్పుడిదే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలు తొందరలోనే జరిపించాలనే లక్ష్యం పెట్టుకున్నారు.ఇప్పుడు ఈ ఎన్నికలలో ఎలా ముందుకు వెళ్లాలి? ఎలా జనం అభిమానం చూరగొనాలి? ఒకవేళ క్యాడర్ రివర్స్ అయితే పార్టీ పరిస్థితి ఏమిటి? పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం కలిగించడానికి ఏం చేస్తే బాగుంటుంది అని బీఆర్ఎస్ అగ్రనేతలంతా ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో అధికారంలో ఉన్నది కాబట్టే స్థానిక పోరులో అత్యధిక స్థానాలు రాబట్టగలిగింది బీఆర్ఎస్. ఈ సారి అధికారానికి దూరంగా ఉండటం, పైగా ప్రజలలో విశ్వాసం కోల్పోవడం, పార్లమెంట్ ఫలితాలు మళ్లీ రిపీట్ అవుతాయా అని ఆందోళన పడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే ఎలాగైనా బీసీ కులగణన చేయాల్సిందేనని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఎలాగైనా మరి కొంతకాలం పంచాయతీ ఎన్నికలు జరగకుండా ఆపగలిగితే తాము లబ్ది పొందవచ్చని భావిస్తున్నారుఇంకా ఏమైనా లొసుగులు ఉంటే అవసరమైతే కోర్టు ద్వారా పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోని రేవంత్ సర్కార్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలనే కృత నిశ్చయంతో ఉంది. పోరుకు పోతే తమకే నష్టం అని భావిస్తున్న బీఆర్ఎస్ గెలిచే ప్రాంతాలలో తప్ప తక్కిన చోట్ల పోటీచేయకూడదని భావిస్తున్నట్లు సమాచారం. అయితే రణం లేకుంటే శరణం ఇదీ పార్టీ పరిస్థితి అని జనం చర్చించుకుంటున్నారు.