గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ

- Advertisement -

గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన..పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి
కరీంనగర్

Check Gunneruvaram Police Station

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను  బుధవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి, తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి  సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టబడిన నూతన చట్టాల అమలు జరిగేలా చూడాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.
గంజాయి రవాణా, అక్రమ ఇసుక  రవాణా మరియు పిడిఎస్. బియ్యం, పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం,  వంటి వాటిని గుర్తించి తగిన కేసులు నమోదు చేసి, వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం పోలీస్ స్టేషన్ ఎస్సై నరేష్  ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular