రైతే రాజు ఉంటున్నారు రైతు ను కూలి చేస్తున్నారు
కౌతాళం
The king is staying with the farmer and the farmer is being hired
కేసీ కెనాల్ కు పుష్పల నీరు ఉన్న కూడా కౌతలము మేజర్ కల్వకు నీరందించలేక అధికారులు ఫిలమవుతున్నారని రైతులు వాపోతన్నారు. ఒకప్పుడు కౌతాలము మేజర్ కాలువకు 1100 నుంచి 1300 ఎకరాల వరకు సాగు చేసేవారని కనీసం ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 400 నుంచి 500 ఎకరాల వరకే సాగు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కౌతాళం మేజర్ కాలువ లో 450 ఎకరాలు రౌడుర్ 500 ఎకరాలు వన్నుర్ ఆయకట్టు లో 150ఎకరాలు వరకు సాగు చేసేవారని అధికారులు నిర్ందించడంలో విఫలమవుతున్నారని రైతే రాజు అంటున్నారే గాని రైతును కూలిగా చేస్తున్నారని వాపోయారు. నీరు లేక సకాలంలో వర్షాలు లేక రైతులు విలవిల లాడుతున్నారని పంటలు పండించుకోవడంలో విఫలమవుతున్నామని , సంవత్సరములు ఆయకట్టు లో కూడా ఒక పంట పండించుకుంటున్నాం ఆ పంట కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారని అధికారులపై ఇండిపడ్డారు. మాకు రావలసిన నీరు మాకు అందించడంలో ఎందుకు మీ బాధ అని కౌతలం మేజర్ కాల్వకు 60 రింగులు ఉండగా కనీసం 30 నుంచి 40 రింగులు వదలక పదే రింగులు వదిలి రైతులను నానా కష్టాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని రైతుల దేశానికి వెన్నెముక అని అంటున్నారే గాని అది కేవలం నామమాత్రమే అని మాకు రావలసిన నీరు మాకు అందించి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ గారిని మరి విన్నవించుకుంటున్నామని అధికారులు వెంటనే స్పందించి మాపై చొరవ చూపాలని మాకు రావాల్సిన నీరు మాకు అందించి పంట పొలాలను కాపాడాలని రైతులు మేజర్ కాలువ దగ్గర మొర పెట్టకున్నారు. , ఈ కార్యక్రమంలో రఘురాం, దాట్ల సుబ్బరాజు, ఆనంద్ ,మల్లయ్య ముగది లక్ష్మయ్య ,గురుస్వామి, దొడ్డయ్య ,వీరారెడ్డి ,రంగప్ప, పుగినాగుడు, తిక్క నాగుడు ,నాగప్ప కెవి సుబ్బరాజ్, కృష్ణ, శీను, భీమయ్య నరసింహులు, రైతులు వున్నారు.