Friday, March 27, 2026

 ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- Advertisement -

 ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Hospital surroundings should be kept clean

పెద్దపల్లి
పట్టణంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చీకురాయి రోడ్డు వద్ద ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ.ఎన్ .సీ రిజిస్ట్రేషన్, ఆరోగ్య మహిళా కార్యక్రమం అమలు, వైద్య పరీక్షల నిర్వహణ, రిఫరల్ కెసులు, అవుట్ పేషంట్ వంటి పలు అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రిఫర్ చేసిన కేసులను ఫాలో అప్ చేయాలని అన్నారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం కింద వచ్చే మహిళలకు అవసరమైన అన్ని పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. గర్భిణీ మహిళల ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ 100 శాతం పూర్తి చేయాలని అన్నారు. ఔట్ పేషంట్ రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.  జిల్లా కలెక్టర్ వెంట వైద్య అధికారి డాక్టర్ స్వప్న,  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్