సూర్య హీరోగా ‘బాహుబలి’ రేంజ్ సినిమా…

- Advertisement -

దుమ్ము రేపుతున్న కంగువా ట్రైలర్

‘Baahubali’ range movie with Surya as hero…

హైదరాబాద్ ,  ఆగస్టు 12
స్టార్ హీరో సూర్య శివ కుమార్ కథానాయకుడిగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సినిమా ‘కంగువ’. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. మాటల్లేవ్, మాట్లాడుకోవడాలు లేవ్… జస్ట్ విజువల్ ఫీస్ట్ అన్నట్టు ఉంది ట్రైలర్.
సూర్య హీరోగా ‘బాహుబలి’ రేంజ్ సినిమా…
ఆ యాక్షన్, విజువల్స్, మ్యూజిక్ అదుర్స్ అంతే!
‘కంగువ’ ట్రైలర్ 2.36 నిమిషాలు ఉంది. అందులో కథ ఏమిటి? క్యారెక్టర్లు ఏమిటి? అనేది రివీల్ చేశారు. అవి పక్కన పెడితే… ఆ విజువల్స్, యాక్షన్, కాస్ట్యూమ్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ అదుర్స్ అనేలా ఉంది. ముఖ్యంగా ‘బాహుబలి’ రేంజ్ సినిమా అనే వైబ్ కలిగించింది.  ‘మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటన్నిటి కంటే మనది అంతు చిక్కని రహస్యం’ అని మహిళ చెప్పే మాటలతో ‘కంగువ’ ట్రైలర్ మొదలు అయ్యింది. లావా ప్రవహించే నదులు, భారీ బోటులు, చేతులు నరికి సముద్రంలో పడేసే క్రూరమైన మనుషులు మధ్య తన తెగను కాపాడుకోవడానికి కథానాయకుడు ఏం చేశాడు? అనే కథతో సినిమా తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది. యాక్షన్ సన్నివేశాల్లో సూర్య అదరగొట్టారు. బాబీ డియోల్ తన గెటప్, నటనతో చాలా భయపెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే.  విజయదశమి కానుకగా ‘కంగువ’ను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు కొన్ని రోజుల క్రితం వెల్లడించారు. అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular