జోగి రమేష్ ఫ్యామిలీ పై ఏసీబీ కేసు నమోదు
ACB has registered a case against Jogi Ramesh’s family
విజయవాడ
జోగి రమేష్ ఫ్యామిలీ పై ఏసీబీ కేసు నమోదు అయింది. ఏ1 గా జోగి రాజీవ్ పేరు ఏసీబీ చేర్చింది. ఏ2 గా జోగి వెంకటేశ్వరావు పేరు చేర్చారు. మండల సర్వే రమేష్, విలేజ్ సర్వేయర్ దేదీప్య, వి నాగేశ్వరరావు నున్న సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు చేసారు.
సెక్షన్ 120b ,420 ఐపీసీ, పిసి యాక్ట్ 7,12 సెక్షన్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారం ఆగస్టు 8న కేసు నమోదు చేసింది ఏసీబీ.
అవ్వ వెంకట శేషు నారాయణ ఫిర్యాదు మేరకు వెస్ట్ ఏసిపి విచారణ చేపట్టారు. విచారణ నివేదికను గతంలోనే డీజీపీకి ఎన్టీఆర్ జిల్లా సిపి సమర్పించారు. మండల సర్వేయర్, గ్రామ సర్వేయర్ తప్పుడు సర్వే చేశారని, నివేదికలో విజయవాడ పోలీసులు పేర్కోన్నారు. నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. సర్వే జరపకుండా, సరిహద్దుల్లో ఉన్నవారికి నోటీసులు ఇవ్వకుండా సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా ఏసీబీ నిర్ధారించింది. 87 సర్వేనెంబర్ సిఐడి అటాచ్ లో ఉందని గుర్తించింది. నున్న సబ్ రిజిస్టర్ రికార్డ్స్ ను సరిగా పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేశారని పేర్కొంది.




