Wednesday, March 4, 2026

కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా

- Advertisement -

కాంగ్రెస్ లో వైసీపీ విలీనమేనా

Is the merger of YCP in Congress?

విజయవాడ, ఆగస్టు 16
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనానికి సంబంధించి ఆమె మాట్లాడారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. వైసీపీని తమ పార్టీలో విలీనం చేస్తారనే ప్రచారంపై ఆమె స్పందించారు. పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఒకవేళ వారు కలుస్తామని అంటే ఖచ్చితంగా స్వాగతిస్తామంటూ ఆమె పేర్కొన్నారు. వైసీపీ చీఫ్ తో కాంగ్రెస్ చర్చలు జరిపిందనే ప్రచారం అబద్ధమంటూ షర్మిల అన్నారు. ఏపీలో జగన్ తిరిగి అధికారంలోకి రాబోరంటూ ఆమె జోస్యం చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ సీటుతో పండుగ చేసుకోమంటూ ఆమె జగన్ కు సెటైర్ వేశారు.ఇదిలా ఉంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. నగర మేయర్ పాటు 12 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నాయుడు పాలెంలో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్