కొమరబండ మేజర్ కు నీటి విడుదల!
Water release to Komarabanda Major!
ఎమ్మెల్యే నిధులతో మేజర్ కాలువకు మహర్దశ!!
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు! కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి! కోదాడ/నడిగూడెం: ఆగస్టు 19(వాయిస్ టుడే ప్రతినిధి). నాగార్జునసాగర్ ఎడమ ప్రధాన కాలువకు, రామాపురం వద్ద ఉన్న125 కిలోమీటర్లో ఉన్న, 13 బి కొమరబండ మేజర్ కాలువ,పూడికతీత, పనులకు నాలుగు లక్షల 40వేలు. మంజూరు చేసిన, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కి నడిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్కూరు వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మేజర్ కాలువ పూడిక తీయడం వలన కొమరబండ , వాయిల సింగారం, తెల్లబల్లి ,రత్నవరం, రామాపురం ,ఈకే పేట, గ్రామాలకు చెందిన ఆయకట్టు భూములకు నీరు నిరంతరాయంగా అందుతాయని వెంకటరెడ్డి తెలిపారు. అదేవిధంగా సాగర్ కాలువకు అనుబంధంగా ఉన్న ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు రైతు సంఘం నాయకులు ఏనుగుల వీరాంజనేయులు కోరారు.



