పలు కుటుంబాలకు  మంత్రి శ్రీధర్ బాబు పరామర్శలు

- Advertisement -

పలు కుటుంబాలకు  మంత్రి శ్రీధర్ బాబు పరామర్శలు

Minister Sridhar Babu visited many families

మంథని
మంథని పట్టణంతో పాటు మంథని మండలంలో పలు కుటుంబాలను ఐటి, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం పరామర్శించారు. మంథని పట్టణంలోని స్పోర్ట్స్ జర్నలిస్టు మహావాది సుధీర్ తల్లి సరోజనమ్మ,  భాగవతుల మోహన్, దొంతుల రాజ లింగయ్య లు  ఇటీవల అనారోగ్య కారణంగా మరణించగా వారి వారి కుటుంబాలను  ఐటి, పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంథని మండలం వెంకటాపూర్ గ్రామం లో మాజీ సర్పంచ్ అక్కపాక  సమ్మయ్య , చిట్యాల శంకర్ లు ఇటీవల అనారోగ్య కారణంగా  మరణించగావారి కుటుంబాలను సైతం మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంథని మండలంలోని గుమ్మునూరు గ్రామ మాజీ సర్పంచ్  బందెల రామస్వామి  అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు  బుధవారం ఉదయం లక్ష్మీపూర్ లోని వారి స్వగృహానికి వెళ్లి రామస్వామి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా  ఉంటామని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular