Thursday, March 26, 2026

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

- Advertisement -

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
నిందితుడు 24 గంటలలోపు అరెస్టు

A three year old girl was raped

సిద్దిపేట
సిద్దిపేట
మూడేళ్ల చిన్నారిపై ఆత్యాచారానికి ఒడిగడ్డ నిందితుడిని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు ఒక రోజులోనే అరెస్టు చేసారు. త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ కేసు వివరాలు తెలియపరుస్తూ. సిద్దిపేట పట్టణం మైత్రివనం నందు నిర్మిస్తున్న గో గ్రీన్ అపార్ట్మెంట్ నందు నేపాల్ కు చెందిన వ్యక్తి వాచ్ మెన్ గా పని చేస్తూ తన భార్య, మనవరాలితో కొడుకు కూతురు, నివాసం ఉంటున్నాడు.  19.8.2024 న అదే అపార్ట్మెంట్ నందు పెయింటింగ్ పని చేయుచున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ జిల్లా రసూల్ పురా గ్రామనికి చెందిన అజయ్, అనే వ్యక్తి, వాచ్ మెన్ యొక్క 3 సంవత్సరాల వయస్సు గల మనుమరాలిని అడిస్తానని చెప్పి తన రూంలోకి తీసుకపోయి అత్యాచారం చేసాడు.  పాప ఏడుస్తుండడంతో వాచ్ మెన్ వెళ్ళి చూసి మనవరాలిని ఎత్తుకొని వెంటనే పోలీసులకు సమాచారం అందించగా త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి విచారణ జరిపి పాపను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం జరిగింది. సంఘటన విషయంలో కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి కేసు పరిశోధనలో భాగంగా పై నిందితున్ని మంగళవారం 4 పొన్నాల బ్రిడ్జ్ వద్ద ఏదైన వాహనం ఎక్కడానికి నిందితుడు నిలబడి ఉండగా పట్టుకున్నారు. చికిత్స పొందుతున్న పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్