బ్లూ కోల్డ్స్ సిబ్బందికి నూతన టాబ్స్

- Advertisement -

బ్లూ కోల్డ్స్ సిబ్బందికి నూతన టాబ్స్
అందజేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ

New tabs for Blue Colds staff

డయల్ 100 కాల్స్ కి తక్షణమే స్పందించి వెంటనే  సంఘటనా స్థలానికి చేరుకోవాలి. ప్రజల ధనమాన ప్రాణ రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలి. డయల్ 100 రాగానే ఎలాంటి  అలసత్వం వహించకుండా వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవాలి*
పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ఈ సందర్భంగా మాట్లాడుతూ.  రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ  ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు.  డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్ పెట్రోల్ కార్ నిరంతరం  గస్తీ నిర్వహించాలని  సూచించారు. ప్రజలకు ఎల్లపుడు  అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.  సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని, ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించాలని సూచించారు. డయల్ 100 కాల్ ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్కు రాకుండా వారు ఉన్న ప్రదేశానికి  పోలీసులు సేవలందించే విధంగా  ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోలీసుల సేవలు తప్పనిసరిగా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఆపద సమయాలలో  డయల్ 100 కు కాల్ చేసి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్, ఐటీ కోర్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, మరియు బ్లూ కోర్ట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular