*మనందరికీ పనికొచ్చే కోర్టు తీర్పు ..!*
A court verdict that works for all of us..!
*చదువుతో సంబంధం లేకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది .* రాదేశామ్ మరియు ఇతరులు వర్సెస్ రాజస్థాన్ రాష్ట్రం అనే కేసులో ఇటీవలి కాలంలో సుప్రీం కోర్ట్ ఒక ఆసక్తికర తీర్పు ఇచ్చించింది మనలో చాలామంది స్థలం లేదా ఇండ్లు , అపార్ట్మెంట్స్ కొనడానికి గానీ అమ్మడానికి గానీ అగ్రిమెంట్ చేసుకుంటాం, కానీ ఆ అగ్రిమెంట్ ప్రకారం అమ్మకుండా లేదా కొనకుండా మోసం చేయడం చూస్తున్నాం. కొన్ని సార్లు మనమే మోసపోతుంటాం అలాంటపుడు ఎం చెయ్యాలి ఏం చేయకూడదో ఈ తీర్పుతో తెలుస్తుంది . రాజస్థాన్ రాష్ట్రంలో రాజ్ ఘర్ అనే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక ఆస్థిని కొనడానికి 5,11,00000 రూ (ఐదు కోట్ల పదకొండు లక్షలు) కు అగ్రిమెంట్ చేసుకున్నాడు. ముందుగా 11లక్షలు అడ్వాన్స్ (భయానా) కూడా ఇచ్చాడు. మొత్తానికి 18 నెలల్లో పూర్తీ డబ్బులు ఇస్తే ,రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది అగ్రిమెంట్ . అడ్వాన్స్ తీస్కొని ఇప్పుడు మాత్రం అతడు అమ్మను అంటున్నాడు అని అగ్రిమెంట్ చేసుకున్నా వ్యక్తి (కొనే అతను) అతని పై క్రిమినల్ కేసు పెట్టాడు. కానీ కోర్టు మాత్రం ఇది సివిల్ కేసు కానీ, క్రిమినల్ కేసు కాదు అని చెప్తూ , సివిల్ కేసు విచారణ జరుగుతుంది అని తీర్పు చెప్పింది..


