విద్యుత్ స్మార్ట్ మీటర్ల పై 29న రౌండ్ టేబుల్ సమావేశం
Round table meeting on 29th on electricity smart meters
చిలకలూరిపేట,
విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద భారాన్ని మోపెందుకు సిద్ధపడుతుందని భారత కమ్యూనిస్టు పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్చార్జి కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ , సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశంపై ఆగస్టు 29వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్నార్టీ సెంటర్లో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వామపక్ష, రాజకీయ, దళిత, బహుజన, గిరిజన, విద్యార్థి, యువజన, రైతు, కార్మిక, మహిళ సంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు, సిపిఐ నాయకులు బొంతా భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.




