Soon Devara will drop with third song - Hype....
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న కొత్తచిత్రం ‘దేవర-పార్ట్ 1’. ఈ చిత్రం రెండు భాగాలుగా విభజించిన విషయం మనకి తెలిసిందే…. ఇందులో నుండీ రెండు పాటలు కూడా ఇటీవలే రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ గా నిలిచాయి….. మొదటగా దూకే ధైర్యమా జాగ్రత్త…. ఆల్ హైల్…. అనుకుంట మొదటి పాట ఎంత కిక్ ఇచ్చిందో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే విధంగా రెండవ పాట కూడా వారం క్రితం విడుదల అయ్యి యూత్ నీ రొమాంటిక్ గా ఎంతోగానం ఎట్రాక్ట్ చేసింది. శ్రీదేవి కూతురు జాన్వీ అందాలు ఆరబోసిన ఈ పాట ట్రెండింగ్ లో మొదటి స్థానం లో ఉంది…..ఈ పాటలో ఎన్టీఆర్ – జాన్వీ కెమిస్ట్రీ బాగా కుదరడం. చుట్టమల్లే చుట్టేస్తవే….. అనుకుంటూ వీరిద్దరి జోడీ చూడముచ్చటగా ఉండటంతో దేవర ఆల్బమ్ దాదాపు అదిరిపోతుంది అని టాలీవుడ్ ఇండస్ట్రీ అభిమానులు అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఇప్పుడు మూడో పాటకు సంబంధించిన అప్డేట్ కొద్దిరోజుల్లో వస్తుంది అని చిత్ర యూనిట్ సోషల్ మీడియా లో చిన్న హింట్ అపుడపుడు ఇస్తూనే ఉన్నారు…. ఆయుధ పూజకు సంబంధించిన పాట రాబోతోన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. పాట ఎప్పుడు వచ్చినా బీభత్సమే అని టాలీవుడ్ అభిమానులకి హైప్ పెంచేశాడు. ఎన్టీఆర్ దేవర సినిమా మీద ఉన్న హైప్ అంతా ఇంతా కాదు…. కొరటాల శివ సినిమా నీ టైం తీసుకొని శిల్పం లాగా చెక్కుతున్నాడు. ఎన్టీఆర్ సైతం ఈ మూవీ మీద చాలా ఫోకస్ తో ఉన్నాడు. అనిరుధ్ మ్యూజిక్ తో ఈ మూవీని ఇప్పుడు భుజానికి ఎత్తుకున్నాడు. మ్యూజికల్ ప్రమోషన్స్ ఆల్రెడీ పీక్స్ స్టేజీకి చేరుకున్నాయి. ఫియర్ సాంగ్, చుట్టమల్లే పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అనిరుధ్ మరియు జొనిత కూడా అమెరికా లో జరుగుతున్న కన్సర్ట్ లో పాటలు పాడటం మూవీ కి ఓవర్సీస్ లో కూడా హైప్ పెంచుతున్నారు. ఇక మూడో పాటకు సంబంధించిన షూటింగ్ ఈ మధ్యనే జరిగింది. అది కూడా ఎన్టీఆర్ ఇంట్రో సాంగ్ అని లీక్ వచ్చింది. ఆయుధ పూజకు సంబంధించిన ఈ పాట షూటింగ్ గురించి లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అప్పుడే లీక్ కూడా ఇచ్చేశాడు. కెమెరామెన్ రత్నవేలు కూడా ఈ పాట షూట్ గురించి చెప్పాడు.ఆల్బమ్ వేరే లెవెల్ వచ్చింది అంతే అంటూ రామజోగయ్య శాస్త్రి వేసిన ట్వీట్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది.



