లగ్జరీ ఫీచర్లతో మార్కెట్లోకి కియా సోనెట్..ధర ఎంతంటే?
Kia Sonet in the market with luxury features..what is the price?
కియా సోనెట్ ఆకర్షణీయమైన డిజైన్, లగ్జరీ ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైంది. అయితే, భారత మార్కెట్లో ఆకర్షణీయంగా రూపొందించిన SUVలకు పెరుగుతున్న డిమాండ్‌ను చూసి..Kia Automobile తన కంపెనీ తరపున Kia Sonetని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇది లగ్జరీ ఫీచర్లు, గొప్ప డిజైన్, అద్భుతమైన పనితీరుతో కూడిన శక్తివంతమైన SUV అని తెలుస్తోంది. కాగా, ఈ కారు పూర్తి సైజు సూట్‌కేస్, మీడియం సైజు ట్రాలీ బ్యాగ్, కొన్ని చిన్న బ్యాగ్‌లను సులభంగా ఉంచగలదు. ఒకవేళ మీరు ఒక సబ్ కాంపాక్ట్ SUV కోసం వెతుకుతున్నట్లయితే..ఇంజన్ ఆప్షన్‌ల ఎంపిక, అనేక ఫీచర్లతో కూడిన గొప్ప ఫీచర్ ప్యాకేజీ కోసం చూస్తున్నట్లయితే..Kia Sonet మీకు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో Kia Sonet గురుంచి పూర్తిగా ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
ఫీచర్లు
కియా సోనెట్ ఫీచర్ల గురించి మాట్లాడుతే..ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది కాకుండా…ఈ కారు 10.25 అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ముందు వెంటిలేటెడ్ సీట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, పుష్ బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ, 7 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్‌ను, ఇలా మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది.
సేఫ్టీ ఫీచర్లు
కియా సోనెట్ యొక్క సేఫ్టీ ఫీచర్లును చూస్తే..ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, లెవల్ 1 అధునాతన డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్‌తో కూడిన కెమెరా ఉండడం విశేషం.
ఇంజిన్
కియా సోనెట్ యొక్క ఇంజిన్ గురించి మాట్లాడుతే..దీనికి 3 ఇంజిన్ ఎంపికలు ఉన్నాయి. ఎంపికలు క్రింది విధంగా ఉన్నాయి.
1. 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు 83 PS పవర్, 115 Nm టార్క్ ఉత్పత్తి చేసేలా రూపొందించారు. కాగా, ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
2. 1 లీటర్ 3 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 120 PS పవర్, 172 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ క్లచ్ పెడల్-లెస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
3. 1.5 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 115 PS పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ క్లచ్‌లెస్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
ధర
కియా సోనెట్ 5 సీట్ల కాంపాక్ట్ SUV. ఇది మొత్తం పది వేరియంట్‌లు, 8 రంగులతో భారతీయ మార్కెట్లో విడుదలైంది. కియా సోనెట్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 8 లక్షలుగా ఉంది. కాగా, దాని టాప్ వేరియంట్ ధర మాత్రం రూ. 15.77 లక్షలు గా ఉంది



