అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం-సిఎం రేవంత్ హామి

- Advertisement -

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం-సిఎం రేవంత్ హామి

We will do justice to the victims of Agrigold-CM Revanth Hami

హైదరాబాద్
అగ్రిగోల్డ్ అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ హామి ఇవ్వడం పట్ల  తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సిపిఐ సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎన్.సునీత హర్షం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ ఎక్కువ లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించి మోసం చేసిందని, వారికి న్యాయం చేయాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ కూనంనేని సాంబశివరావు నేతృత్వంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధుల బృందం సిఎం రేవంత్ కలిసి వినతి పత్రం సమర్పించింది. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులు 5 లక్షలమంది ఉన్నారని, వీరి నుంచి ఆ సంస్థ రూ.500 కోట్లను సేకరించిందని తిరిగి చెల్లించే సమయం ఆ సంస్థ చేతులెత్తేసిందని సిఎంకు బాలమల్లేష్ వివరించారు. రాష్ట్రంలో ఆ సంస్థకు దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఆస్తులున్నాయని వాటిని  ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకుని వేలం వేయడం వేసి మోసపోయిన బాధితులకు డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని ఈ సందర్బంగా ఆయన సిఎంకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో  హైపవర్  కమిటీ ఏర్పాటు చేయాలని, ఆగ్రిగోల్డ్ కంపెనీ పౌండర్ డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యుల బినామీ పేర్ల మీద ఉన్న అన్ని ఆస్తులను తక్షణమే ఆటాచ్ చేయాలని సిఎంను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సిఎం రేవంత్ సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామి ఇచ్చినట్లు బాలమల్లేష్ తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular