- Advertisement -
నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు- అనేక రకాలుగా వేధించారు
They violated my personality - harassed me in many waysముంబయి నటి కాదంబరి జెత్వానీ
ముంబయి సినీనటి జెత్వానీ వైఎస్సార్సీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వెళ్లిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. వైసీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబయి సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ కార్యాలయానికి వచ్చిన నటి తనపై జరిగిన వేధింపుల వివరాలను పోలీసులకు వివరించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు.
పెళ్లి వద్దన్నందుకే నాపై కక్ష
ఈ కేసులో నిజాలు బయటకు రావాలని ముంబయి నటి అన్నారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆమె వాపోయారు. వైఎస్సార్సీపీ నేతలు, పోలీసుల వల్ల తాను, తన కుటుంబసభ్యులు చాలా ఇబ్బంది పడ్డామని తెలిపారు. అంతే కాకుండా వాళ్లు తన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ఆరోపించారు. తనను అనేక రకాలుగా వేధించారని అన్నారు. తన దగ్గరున్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు ఇచ్చినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నేత విద్యాసాగర్ తన దగ్గర పెళ్లి ప్రస్తావన తెచ్చాడని కానీ తాను వ్యతిరేకించినట్లు వివరించారు. విద్యాసాగర్‌ను వద్దన్నాననే అసూయతో తనపై కక్ష కట్టాడని వాపోయారు.
- Advertisement -




