అధికారులు అప్రమత్తంగా వుండాలి

- Advertisement -

అధికారులు అప్రమత్తంగా వుండాలి

Officials should be vigilant

సీఎం చంద్రబాబు
అమరావతి
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో, పలు పట్టణాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై అధికారులతో సీఎం మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు చెయ్యాలని, అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మ్యాన్ హాల్, కరెంట్ తీగలు తెగిపడే ప్రమాదాల జరగకుండా చూడాలని ఆదేశించారు.అన్ని శాఖలు అలెర్ట్ గా ఉండాలని అన్నారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించాలి. పొంగే వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చూడాలి. భారీ వర్షాలు పడే ప్రాంతాల ప్రజల మొబైల్స్ కు మెసేజ్ ద్వారా అలెర్ట్ పంపాలని సూచించారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular