Friday, April 17, 2026

కోల్‌కతా వీధుల్లో పోలీసుల జల ఫిరంగులకు ఎదురేగి నిలిచిన ఆ సాధువెవరు?

- Advertisement -

కోల్‌కతా వీధుల్లో పోలీసుల జల ఫిరంగులకు ఎదురేగి నిలిచిన ఆ సాధువెవరు?

Who is that saint who faced the water cannons of the police on the streets of Kolkata?

విద్యార్థుల పోరాటంలో ఈ సాధువు ఎందుకు? ఈయన విద్యార్థా? అని విమర్శించారు కొందరు..
కానీ ఒక యువ డాక్టర్‌కు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి వచ్చాను అన్నాడా సాధువు..
ఈ సాధువు బీజేపీ అని నిందించారు కొందరు. అంటే వారు తప్ప ఎవరూ మమతకు ఎదురు మాట్లాడ కూడదా?..
కానీ వారికి తెలియదేమో ఈ సాధువు బీజేపీ కాదు. ఆయన తండ్రి కమ్యూనిస్ట్‌, తాత ఒకనాటి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు..
ఇంతకీ ఈయన ఎవరో తెలుసా?
ఈ సన్యాసి పేరు బలరాంబోస్‌.. తండ్రి పేరు కమల్‌బోస్‌, ఒకప్పుడు కలకత్తా నగర మేయర్‌. కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రముఖ నాయకుల్లో ఒకరు.. తాత పేరు భూపేంద్ర బోస్‌, ఆలిండియా కాంగ్రెస్‌కు ఒకప్పుడు అధ్యక్షునిగా పని చేశారు..
ఇంతకీ బలరాంబోస్‌ ఏం చేస్తుంటారు?.. ఆయన ఎంటెక్‌ చదివారు. గణిత బోధకుడు.. కోల్‌కతాలో కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి.. పదేళ్ల క్రితం సన్యాసం స్వీకరించారు. తనకు సనాతన ధర్మం అంటే ఇష్టమని, ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని చెబుతున్నారు బలరాంబోస్‌.
ఇంతకీ బలరాంబోస్‌ జాతీయ జెండా పట్టుకొని ఆందోళనలో ఎందుకు పాల్గొన్నారు? ఆయన మాటల్లోనే వినండి.. ‘ నాకో కూతురు ఉంది.. స్త్రీలను మనం గౌరవించాలి, లేకపోతే ఇక్కడ దేవతలు కూడా ఉండరు.. ఒక మహిళకు అన్యాయం జరిగింది.. ఇందుకు వ్యతిరేకంగా నేను గళం ఎత్తాను..’
శభాష్‌.. బలరాంబోస్‌.. నిజమైన భారతీయుడు మీరు.. స్వాతంత్ర్య పోరాట కాలంలో బెంగాలీ నేలపై సన్యాసులు పోరుబాట పట్టడం తెలిసిందే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్