- Advertisement -
కేరళ రాజకీయాల్లో మీ టూ…
ME Two in Kerala politics...
తిరువనంతపురం, సెప్టెంబర్ 2, (న్యూస్ పల్స్)
మహిళా నేత ఆరోపణలతో కేరళ కాంగ్రెస్‌లో రాజకీయ కలకలం రేగుతోంది. కేరళ కాంగ్రెస్‌లో పరిస్థితి సినీ పరిశ్రమ ‘కాస్టింగ్ కౌ’లా ఉందని కాంగ్రెస్ నేత సిమి రోజ్‌బెల్ జాన్ ఆరోపించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి హేమా కమిటీ నివేదిక సంచలనం సృష్టిస్తోంది. ఆ నివేదిక వచ్చిన తరుణంలో కాంగ్రెస్ నాయకురాలి నుంచి ఈ ప్రకటన వచ్చింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మాలీవుడ్ ను కుదిపేస్తుంది. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఎంతోమంది నటీమణులు మీడియా ముందుకు వచ్చి తమకు ఎదురైన చేదు అనుభవాలు, వారి ఆవేదన పంచుకుంటున్నారు. ఈ పరిణామాల వేళ కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది సినీ ఇండస్ట్రీకే పరిమితం కాలేదని.. రాజకీయాల్లోనూ ఈ విపరీత పోకడ ఉందని తాను ఆరోపించారు.కేరళ కాంగ్రెస్ పార్టీలో క్యాస్టింగ్ కౌచ్ తరహా పరిస్థితులు ఉన్నాయంటు సీనియర్ నాయకురాలు సిమీ రోజ్ వెల్ జాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. సిమి రోజ్‌బెల్ జాన్ ఆరోపణలపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. చాలా మంది తమ చేదు అనుభవాల గురించి నాతో కథనాలను పంచుకున్నారు. తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సరైన సమయం వచ్చినప్పుడు బయటపెడతానని చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మహిళలు.. పురుష నేతల నుంచి అభ్యంతరకర ప్రవర్తనను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళా నేతల పట్ల పదవుల ఆశ జూపి కొందరు సీనియర్ నేతలు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని రోజ్ బెల్ ఆరోపించారు. అంతేకాకుండా.. నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికే అవకాశాలు లభిస్తున్నాయని, తద్వారా కేరళ కాంగ్రెస్ విభాగంలో ఉన్నత స్థానాల్లో అర్హత లేని కొందరు మహిళలు ఉన్నారని అన్నారు. అయితే ఆమె ఆరోపణలు పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీశాయి. ఆమెపై రాష్ట్ర మహిళా కాంగ్రెస్ విభాగం పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసింది.2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది. నటుడు దిలీప్ కారులో తనపై లైంగిక దాడికి రౌడీలను ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతడిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల తన నివేదికను సమర్పించింది. దీని తర్వాత, మాలీవుడ్‌లోని చాలా మంది ప్రముఖ నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వారిపై కేసులు కూడా నమోదయ్యాయి.సిమి ఆరోపణల కారణంగా కాంగ్రెస్ రాజకీయాల్లో వివాదం రేపుతుందని భావిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ, సీపీఎం కాంగ్రెస్‌ను కార్నర్ చేయవచ్చు. కాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)కి జస్టిస్ కె. హేమా కమిటీ నివేదికలో పేర్కొన్న వ్యక్తులను ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపిస్తూ లెఫ్ట్ ఫ్రంట్ సోమవారం సచివాలయం ఎదుట నిరసన చేపట్టనుంది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల సమయంలో వడకర నియోజకవర్గంలో వివాదాస్పద ‘కాఫీర్’ ‘స్క్రీన్‌షాట్‌లను’ రూపొందించి ప్రచారం చేసిన వారికి పినరయి విజయన్ ప్రభుత్వం ఇచ్చిన రక్షణపై ప్రతిపక్షం కూడా నిరసన తెలుపుతుంది. ఆదివారం ఒక ప్రకటనలో రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి.డి. సతీశన్ సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం సచివాలయం ఎదుట నిరసన చేపట్టనున్నారు.ఈ ప్రకటనలో యుడిఎఫ్ కన్వీనర్ ఎం.ఎం.హసన్, కెపిసిసి అధ్యక్షుడు కె. సుధాకరన్, పి.కె. కున్హాలికుట్టి, పి.జె. జోసెఫ్, సి.పి. జాన్, అనూప్ జాకబ్, సిబు బేబీ జాన్ సహా పలువురు ప్రముఖులు ఈ నిరసనలో పాల్గొంటారు.
- Advertisement -