- Advertisement -
వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
People in flood prone areas should be alert
-రెవెన్యూ పోలీస్ మున్సిపల్ నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-పారిశుధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధులు వ్యాప్తి నివారణకు చర్యలు
-అధికార యంత్రాంగం సైతం అప్రమత్తంగా ఉండాలి
-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
మంథని
జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా అధికార యంత్రాంగం సైతం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు .సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మంథని పట్టణ శివారులోని గోదావరి నది, గౌతమేశ్వర స్వామి ఆలయ పరిసరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఎగువ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారుతుందని, సాయంత్రం నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున, మంథని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు కిందికి విడుదల చేస నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు, ముంపు జరిగే అవకాశం లేదని, అయినప్పటికీ ఆకస్మికంగా భారీ వరదలు ఒకేసారి వచ్చే నేపథ్యంలో ఎటువంటి నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. బొక్కల వాగు సైతం ఉదృతంగా ప్రవహిస్తోందని , జిల్లాలోని వివిధ నీటిపారుదల ప్రాజెక్టులకు వరద వచ్చే నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ పోలీస్ మున్సిపల్ , నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. అతి భారీ వర్షాల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీలలో పారిశుధ్య నిర్వహణ, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి. హనుమా నాయక్ , మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమా సురేష్ రెడ్డి, తహసిల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి తో పాటు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



