హైడ్రా పేరిట బెదిరింపు… కేసు నమోదు

- Advertisement -

హైడ్రా పేరిట బెదిరింపు… కేసు నమోదు

Intimidation in the name of HYDRA… case registered

సంగారెడ్డి
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  ఎంకార్ ప్రాజెక్టు LP ను నిర్మిస్తున్న బిల్డర్ కు హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి  పై  బిల్డర్లు  వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్ రెడ్డి   పిర్యాదు చేసారు.  సోషల్ యాక్టివిస్ట్ , సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నాడు. హైడ్రా కమిషనర్  రంగనాథ్ తో దగ్గరి పరిచయం అని చెప్పి కలిసి దిగిన  ఫోటోలు  చూపి విప్లవ సిన్హా అనే వ్యక్తి  వాట్స్అప్ కాల్ చేసి బెదిరించాడు.
పిస్తా హౌస్ వద్ద కలుద్దామని చెప్పి అక్కడికి పిలిచి హైడ్రా రంగనాథ్  తో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ, రంగనాథ్ తనకు బాగా దగ్గరని అమీన్పూర్ లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని  బెదిరించాడు.  మీ నిర్మాణం జోలికి రావద్దు అంటే తనకు 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడు. హైడ్రా నందు ఫిర్యాదు చేస్తానని, ప్రతిరోజు వార్తాపత్రికల్లో మీ నిర్మాణం గురించి తప్పుగా రాయిస్తానని బెదిరించారు.బాధితుడి పిర్యాదు తో అమీన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular