బుడమేరు అంటే ఎమిటో జగన్ కు తెలియదు

- Advertisement -

బుడమేరు అంటే ఎమిటో జగన్ కు తెలియదు

Jagan does not know what Budameru means

విజయవాడ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావటం కర్మ అని.. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనల్లో కుట్రలు ఉన్నాయా అనే అనుమానం కూడా వస్తుందన్నారు. ఏ ప్రచారం అయినా ముందు వాళ్ళ బ్లూ మీడియాలో వస్తుందని.. వీళ్ళు కట్లకు ఎక్కడ గండ్లు కడతారో అని, ఈ రోజు గట్లు వెంట సెక్యూరిటీని పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తప్పుడు ప్రచారాలు కట్టిపెట్టి, వాస్తవాలు మాట్లాడితే మంచిదని.. అమరావతి మీద ఇంత విష ప్రచారం ఎందుకు ? అని ప్రశ్నించారు. 45 ఏళ్ళ తన రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలిన వ్యక్తిని, పార్టీని చూడలేదన్నారు. గత 5 ఏళ్ళలో ఇలాంటి విపత్తులు వస్తే.. జగన్ రెడ్ కార్పెట్ వేసుకుని ఫీల్డ్ విజిట్ చేసేవారని ఎద్దేవా చేశారు. బుడమేరు అంటే ఏంటో తెలియదు.. ఎలా ప్రవహిస్తుందో తెలియదు.. బుడమేరుకి గేట్లు ఉంటాయని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన ఇల్లు ఎక్కడ, బుడమేరు ఎక్కడ.. కనీస అవగాహన లేని జగన్.. చెప్పినా ప్రజలు నమ్మేస్తారులే అనే విచ్చలవిడితనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular