వేటు తప్పదా❓హైకోర్టు ఆదేశాలతో వలస ఎమ్మెల్యేల టెన్షన్
Migrant MLAs’ tension with wrong High Court orders
హైదరాబాద్:సెప్టెంబర్ 11
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ పరిణామాలతో చట్టం తన పని తాను చేసుకుపోతే… అధికారం అడ్డుపడకపోతే… కోట్లు కుమ్మరించి సాధించుకున్న ఎమ్మెల్యే సీటు గల్లంతేనా..? హైకోర్టు ఆదేశాలతో తేనెతుట్టే కదిలినట్టేనా..?
నాలుగు వారాల గడువులో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలు.. పార్టీ ఫిరాయించిన మిగిలిన ఎమ్మెల్యేల్లోనూ కలవరం పుట్టిస్తోంది. ఇప్పటికే ముగ్గురిపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు డైరెక్షన్ ఇవ్వగా, మిగిలిన ఏడుగురి పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతోంది.
చట్టం ప్రకారం వేటు పడితే.. వలస ఎమ్మెల్యేల భవిష్యత్ ఎలా ఉండబో తోందన్నదే ఆసక్తి రేపు తోంది.6 నెలల్లోనే ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితులు..?హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్క సారిగా పెరిగిపోయింది.
పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలనే హైకోర్టు ఆదేశాలు…. వలస ఎమ్మెల్యేల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో కాలయా పన జరిగినట్లు.. ఇప్పుడు కూడా పదవీకాలం పూర్త య్యేవరకు గడిపేయొచ్చని భావించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు తీర్పుతో ఎదురు దెబ్బ తగిలినట్లైంది. వేటు కత్తి వేలాడుతుండటం… చట్ట ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకుంటే… మూడు అసెంబ్లీ స్థానాలకు ఆరు నెలల్లోనే ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితు లే కనిపిస్తున్నాయి.
ఐతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్‌గా మారగా, హైకోర్టు తీర్పుతో పర్యావ సానాలపై మిగిలిన ఏడు గురు వలస ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు చెబుతున్నారు.
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరలేదు. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ అధికార పార్టీకి ఝలక్ ఇచ్చినట్లైందంటున్నారు.
బీఆర్ఎస్ నుంచి మొత్తం 26 మందిని కాంగ్రెస్‌లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేయగా, ప్రస్తుతానికి 10 మంది మాత్రమే హస్తం గూటికి చేరారు. ఐతే వీరిలో ముగ్గురిపై తక్షణం చర్యలు తీసుకోవాలని గతంలోనే స్పీకర్‌కు, ఆ తర్వాత హైకోర్టుకు నివేదించింది బీఆర్ఎస్.
అనర్హత వేటు వేయడంలో తాత్సారం చేస్తున్న స్పీకర్ తక్షణం నిర్ణయం తీసుకో వాలని ఆదేశించాల్సిందిగా కోరుతూ హైకోర్టుకు వెళ్లింది బీఆర్ఎస్.
ఆ పార్టీ అనుకున్నట్లే అనర్హత వేటుపై తీసుకోబోయే చర్యలకు సంబంధించి షెడ్యూల్ రూపొందించి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కాంగ్రెస్ పెద్దలు కంగుతిన్నారు.
పార్టీ మారిన ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను ఎలా కాపా డుకోవాలనే వ్యూహ రచన చేస్తున్నారు. మరోవైపు కారు దిగిన మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఏ రకమైన భరోసా ఇవ్వాల న్నదానిపై అధికార పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారట…..