- Advertisement -
తెలుగు రాష్ర్టాలకు కేంద్రం గుడ్ న్యూస్
Central good news to Telugu statesన్యూ ఢిల్లీ
తెలంగాణాలో నాలుగు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఆంధ్రప్రదేశ్‌లో రెండు కొత్త ప్రభుత్వ కాలేజీలకు అనుమతి నిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి, మెదక్, మహేశ్వరం కుత్బుల్లాపూర్‌లోని మెడికల్ కళాశాలలకు అనుమతి ఇచ్చింది. విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభానికి అనుమతినిచ్చింది కేంద్రం. నాలుగు కాలేజీల్లో 2024-25 సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు కు అనుమతినిచ్చింది. కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీల అనుమతుల కోసం
చాలా కాలంగా తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. గతంలో ఎనిమిది వైద్య కళాశాలలకు అనుమతికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిరకారించారు. నూతన వైద్య కళాశాలల కు అనుమతి కోసం గత కొంత కాలంగా రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఎనిమిదింటిలో నాలుగు కళాశాలలకు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్‌లో కడప, పాడేరులో ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి ఇచ్చింది.
- Advertisement -




