తండ్రి చేతిలో తనయుడి హతం

- Advertisement -

తండ్రి చేతిలో తనయుడి హతం

The son's death at the hands of the father.

ఆత్మకూర్( ఎస్)

మద్యానికి బానిసై డబ్బుల కోసం వేధిస్తుండగా విసుగు చెందిన తండ్రి కుమారుడిని గొడ్డలితో నరకడం తో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్త తండా ఆవాసం బాపూజీ తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బానోత్ కిరణ్  (36) మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులతో పాటు భార్యను వేధిస్తున్నాడు. బుధవారం భార్య సౌజన్య ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ కు వెళ్ళగా తన భార్యను హాస్పిటల్ లో చూపించడానికి డబ్బులు ఇవ్వాలంటూ కిరణ్ తన తండ్రి బానోతు పంతులు పై ఒత్తిడి తీసుకువచ్చాడు ఈ సమయంలో విసుకు చెందిన పంతులు పక్కనే ఉన్న గోడలతో కిరణ్ పై దాడి చేయగా తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు ఘటన స్థలాన్ని సిఐ సురేందర్ రెడ్డి ఎస్సై సైదులు సందర్శించారు. మృతుని భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular