- Advertisement -
సూర్యాపేటలో కేంద్ర బృందం పర్యటన
Central team visit to Suryapet
సూర్యాపేట
సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు వరదలతో ఏర్పడ్డ పంట నష్టం సహా ఇతర ఆస్తులు రహదారుల డ్యామేజ్ లను కేంద్ర బృందం స్వయంగా పరిశీలిచింది. కోదాడ నియోజకవర్గoలోని అనంతగిరి, కోదాడ మండలాల్లో కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. అనంతగిరి మండలంలోని గోండ్రియాల, కోదాడ మండలంలోని తొగర్రాయి, కూచిపూడి గ్రామాల్లో ధ్వంసమైన ఇండ్లు, నష్టపోయిన పంటలు, ఇసుక మేటలు వేసిన పంటపొలాలు.. కోతకు గురైన రహదారులను కేంద్ర బృందం పరిశీలించింది. తరువాత నడిగూడెం మండల పరిధిలోని కాగిత రామచంద్రపురం పరిధిలోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ తెగి ధ్వంసమైన పంటలు, ఇసుక మేటలు సహ తీవ్ర నష్టం, ఆస్తి నష్టం సహ.. గండ్లు పడ్డ చెరువులు.. ధ్వంసమైన రోడ్లకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ తేజన్ నంద్ లాల్ పవార్ సహ ఇతర అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. కోదాడలో మృతి చెందిన కుటుంబాలతో మాట్లాడారు. కేంద్ర బృందం స్థానిక రైతులతో, ప్రత్యేక్ష సాక్షుల దగ్గర వివరాలు సేకరించారు.
- Advertisement -



