దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లలో ఒకరైన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లి!

- Advertisement -

దేశంలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లలో ఒకరైన కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

One of the most eligible bachelors in the country, Congress leader and Leader of Opposition in Lok Sabha Rahul Gandhi is getting married soon.

54 ఏళ్ల రాహుల్ గాంధీ.. మరికొన్ని రోజుల్లో వివాహం చేసుకోనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీతో రాహుల్ గాంధీ పెళ్లి జరగనున్నట్లు నెటిజన్లు కామెంట్లు, ఫోటోలతో తెగ సందడి చేస్తున్నారు.

దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్ ఎంపీ ప్రణితి షిండేను రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరి కుమార్తె అంటే.
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె.. ఎంపీ ప్రణితి షిండేని రాహుల్ గాంధీ త్వరలోనే వివాహం చేసుకోనున్నారనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను నెటిజన్లు, కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే అసలు ఈ ప్రణితి షిండే ఎవరు అని నెటిజన్లు ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు. 43 ఏళ్ల ప్రణితి షిండే ప్రస్తుతం సోలాపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. గతంలో ఆమె రాహుల్ గాంధీని కలిసిన ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి చేతులు పట్టుకుని ప్రణితి షిండే ఉన్న ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన ప్రణితి షిండే.. ఆ తర్వాత రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం గమనార్హం. ఇవన్నీ చూసిన తర్వాత రాహుల్ గాంధీ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంతోషంలో మునిపోతున్నారు. అయితే వీళ్ల పెళ్లి గురించి అటు గాంధీ కుటుంబం గానీ.. ఇటు షిండే కుటుంబం గానీ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular