- Advertisement -
హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో కొనసాగుతోన్న సంజౌలి మసీదు వివాదం
The ongoing Sanjauli Masjid controversy in Shimla, Himachal Pradeshసిమ్ల సెప్టెంబర్ 14
;హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో సంజౌలి మసీదు వివాదం కొనసాగుతోంది. ఈ మసీదును అక్రమంగా నిర్మించారంటూ హిందూ సంఘాలు, స్థానికులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మసీదు కూల్చాలంటూ ఆందోళన చేపట్టిన నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా నేడు హిమాచల్ వ్యాప్తంగా హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి.ఈ మేరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానికులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో సిమ్లా, కులు సహా ప్రధాన నగరాల్లో దుకాణాలను మూసివేశారు. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. అన్ని ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.
- Advertisement -




