- Advertisement -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
Steel plant privatization should be stopped
విశాఖపట్నం
విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి తగ్గించి మూసివేతకు కారణం అవుతుందని వామపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ సందర్భంగా ఈనె ల 24వ తేదీన జీవీఎంసీలో జరగ నున్న కౌన్సిల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ ను ఆదుకునే విధంగా తీర్మా నం చేసి ముఖ్య మంత్రి కి, ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర నేతలకు తీర్మానం చేసి పంపించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా నేడు జీవీఎంసీ మేయర్ కు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయకుండా అడ్డుకునే విధంగా ఎందుకు చర్యలు చేపట్టడం లేదో అర్థం కావడం లేదని జీవీఎంసీ కౌన్సిల్ పై ఆరోపణలు చేశారు.
- Advertisement -



