Thursday, March 5, 2026

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం

- Advertisement -

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం

Let's not allow the privatization of Visakhapatnam Steel

అసలు చర్చే లేని అంశంపై వైసీపీ దుష్ప్రచారం
తిరుమల లడ్డూపై సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి

గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం

విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం

విశాఖలో సీఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్టర్ సదస్సు అనంతరం మీడియాతో మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం:
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదని.. వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరగనివ్వబోమని స్పష్టం చేశారు. విశాఖ నోవాటెల్ లో సీఐఐ ఇన్ ఫ్ర్రాస్ట్రక్టర్ సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
ఐదేళ్ల తర్వాత ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది పారిశ్రామికవేత్తలు, అందుకు కావాల్సిన ఫైనాన్షియర్స్, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా సమ్మిట్ ఏర్పాటుచేసుకోవడం జరిగింది. భవిష్యత్ లో విశాఖకు ఏం చేయాలి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో పాటు భోగాపురానికి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై చర్చించడం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. గతంలోనే అనేక పెట్టుబడులు వచ్చాయి. వైసీపీ ఐదేళ్ల పాలనలో స్పీడ్ బ్రేకర్ లా అవి ఆగిపోయాయి. వాటిని ముందుకు తీసుకెళ్లేందుకు ఏం చేయాలనే అంశాలపై కూడా చర్చించడం జరిగింది.

గత వైసీపీ పాలనలో వెనుకబడిన ఏపీని ముందుకు తీసుకెళ్తాం
గత ప్రభుత్వం రోడ్లు నిర్మించలేదు, కనీస గుంతలు కూడా పూడ్చలేదు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పారిశ్రామికవేత్తలు కూడా వెనక్కి వెళ్లిపోయారు. ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైజ్ చేయాలి, మౌలిక సదుపాయాలపై పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలి. వెనుకబడిన ఏపీని మళ్లీ ముందుకు తీసుకుళ్లేందుకు సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం. వారి సలహాలతో వాటిని ముందుకు తీసుకెళ్తాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. ఎవరెక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అందుకు తగ్గట్లుగా రాయితీలు కల్పిస్తాం. పెట్టుబడులను పెద్దఎత్తున ఆహ్వానిస్తున్నాం.

విశాఖను ఐటీ డెస్టినేషన్ గా తీర్చిదిద్దుతాం
గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. గత ప్రభుత్వం పక్కనపెట్టేసింది. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున విశాఖలో పెట్టుబడులు రాబోతున్నాయి. విశాఖను ఇతర రాష్ట్రాలతో పోటీపడేవిధంగా చేస్తాం. నిరుద్యోగ యువతకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పిస్తాం. ఇప్పటికే అనేక ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీతో మేం చర్చించాం. ఇప్పటికే విశాఖలో ఉన్న ఐటీ కంపెనీలతో సమావేశమై వారికున్న సమస్యలపై చర్చించడం జరిగింది. అవన్నీ పరిష్కరించడం జరిగింది. ఓ పెద్ద ఐటీ కంపెనీ 1500 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. వచ్చే ఐదేళ్లలో 20వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ఆ కంపెనీకి గతంలో వీధిదీపాలు కూడా వేయలేదు. వారికి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు. అవన్నీ క్లియర్ చేశాం. కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా వచ్చారు. ఫీల్డ్ విజిట్స్ కి కూడా వెళ్తున్నాం.

రాబోయే వంద రోజుల్లో ఐటీ పాలసీ తీసుకువస్తాం
రాబోయే వంద రోజుల్లో ఐటీ, జీసీసీ పాలసీ తీసుకువస్తాం. రాబోయే రోజుల్లో పెద్దఎత్తున ఐటీ పెట్టుబడులు తీసుకువస్తాం. ఎమర్జింగ్ టెక్నాలజీస్ పై దృష్టిసారిస్తున్నాం. డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. గతంలో ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం. దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. భూమి కూడా ఇచ్చి శంకుస్థాపన కూడా చేశాం. వైసీపీ ప్రభుత్వంలో నీరుగారిపోయింది. వారందరితో సమావేశమై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్