Tuesday, March 10, 2026

శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు

- Advertisement -

శ్రీశైల దేవస్థానం హుండీల లెక్కింపు
శ్రీశైలం

Srisaila Devasthanam Counting of Hundis

గురువారం రోజు న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.4,00,65,375/- నగదు రాబడిగా లభించింది. ఇందులో ఆలయ హుండీల ద్వారా రూ.3,86,82,32/-లు మరియు అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా 10,83,054/-లు (మొత్తం రూ.4,00,65,375/-లు) లభించాయి.కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజులలో (22.08.2024 నుండి 25.09.2024 వరకు) సమర్పించడం జరిగింది.
అదేవిధంగా అన్నదానం హుండీ రాబడి మార్చి 12వ తేదీ నుంచి సెప్టెంబరు 25వ తేదీ వరకు సమర్పించడం జరిగింది.అదేవిధంగా 488 యుఎస్ఏ డాలర్లు 12 కువైట్స్ దినార్స్, 6000- ఉగాండా సిలింగ్స్ 30 – యకే పొండు.. 60 – సింగపూర్ డాలర్లు 20 హంకాంగ్ డాలర్లు 10 – ఈరోస్, 20 మలేషియా రింగిట్స్ మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆర్. రమణమ్మ, పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్