ఫ్యాన్స్ అత్యుత్సాహం.. సెలబ్రేషన్స్ లో అపశృతి

- Advertisement -

ఫ్యాన్స్ అత్యుత్సాహం.. సెలబ్రేషన్స్ లో అపశృతి

Fans are enthusiastic.. There is chaos in the celebrations

సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానుల మద్య తగలబడిపోయిన జూ.ఎన్టీఆర్ భారీ కటౌట్
హైదరాబాద్‌ సెప్టెంబర్ 27
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన క్రేజీ మూవీ దేవర రిలీజ్ సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే, ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల సెలబ్రేషన్స్ లో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానులు క్రాకర్స్ కలుస్తూ హంగామా చేశారు. దీంతో ఎన్టీఆర్ భారీ కటౌట్  మంటల్లో తగలబడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఈరోజు విడుదలైన దేవర మూవీకి పాజిటీవ్ టాక్ వస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టామంటూ అభిమానులు రచ్చ చేస్తున్నారు.
కాగా ఈరోజు (సెప్టెంబర్ 27న) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర మూవీకి పాజిటీవ్ టాక్ వస్తోంది. రిలీజ్ సందర్భంగా అర్థరాత్రి నుంచే షోలు వేశారు. అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేవర మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పందించారు. “నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రోజు రానే వచ్చింది… మీ అపురూపమైన స్పందనలతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. కొరటాల శివ, ఆకట్టుకునే డ్రామా, భావోద్వేగ అనుభవంతో దేవరను ఊహించినందుకు ధన్యవాదాలు. నా సోదరుడు అనిరుధ్..  మీ సంగీతం, నేపథ్య స్కోర్ప్ర దేవర ప్రపంచానికి జీవం పోశాయి. నా నిర్మాతలు హరికృష్ణ కొసరాజు, సుధాకర్ మిక్కిలినేని బలమైన స్తంభాలుగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. దేవర టీమ్ కు పెద్ద థ్యాంక్స్. నా అభిమానులకు, దేవర కోసం మీరు జరుపుకునే వేడుకలను చూడటం నన్ను చాలా ఆనందానికి గురి చేసింది. మీ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను చేసినంతగా మీరు కూడా ఆనందిస్తున్నందుకు సంతోషం. మీ అందరినీ అలరిస్తూనే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular