Friday, March 27, 2026

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి

- Advertisement -

*నగర పాలక సంస్థ అకౌంట్స్ లో అవినీతి అధికారుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నా నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్.*

*కాంగ్రెస్ పాలనలో అవినీతిమయమైన నగర పాలక సంస్థ*

*కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే బిల్లుల చెల్లింపు*

*అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి*

*చర్యలు తీసుకునే వరకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం*

*అకౌంట్స్ అధికారులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ చిన్నచిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు*

Action should be taken against corrupt officials

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… కరీంనగర్ నగర పాలక సంస్థ అకౌంట్స్ సెక్షన్ లో అధికారుల చేతివాటం మొదలైంది… చేతివాటానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత… మొన్న కొత్త కమీషనర్ బాధ్యతలు తీసుకునే వరకు 15 కోట్ల 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు పేమెంట్ చేశారు. 10శాతం కమీషన్ ఇచ్చిన వారికి ఇంత… 15 శాతం కమీషన్ ఇచ్చిన వారికి ఇంత అంటూ పేషెంట్లు చేస్తున్నారు. కాంట్రాక్టర్ సీనియారిటీ… చేసిన పని శాతం… లేదా కాంట్రాక్టర్ అవసరాన్ని బట్టి పేమెంట్ చేయాలనే విషయాన్ని అధికారులు మరిచారు. గడిచిన 10 నెలలుగా 10 నుంచి 15 శాతం ఇచ్చిన వారికే పేమెంట్ చేస్తున్నారు. కమీషన్ ఇవ్వని కాంట్రాక్టర్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

కరీంనగర్ నగర పాలక సంస్థ పై సుమారు 120 మంది కాంట్రాక్టర్లు ఆధారపడి జీవిస్తున్నారు. 2 నుంచి 3 సంవత్సరాలుగా పెట్టుబడి పెట్టి పనులు చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లు… ఇప్పుడు కమీషన్ డబ్బులు ఎక్కడి నుండి తేవాలంటూ ఆవేదన చెందుతున్నారు. 15.30 కోట్ల పేమెంట్ పై కలెక్టర్… మున్సిపల్ కమిషనర్… ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తాం. నగరపాలక సంస్థలు జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పాలి. గతంలో పండుగల కోసం అప్పటి ప్రభుత్వం అత్యవసర పనుల నిమిత్తం నిధులు కేటాయించేది. కాంగ్రెస్ పాలనలో చిన్నచిన్న అత్యవసర పనులు చేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించడం లేదు. పండగల వేళ చిన్నచిన్న కాంట్రాక్టర్లు వారు చేసిన పనికి పర్సంటేజ్ వైజ్ గా పేమెంట్ ఇవ్వాలి.

కాంగ్రెస్ పాలనలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు బతికే పరిస్థితి లేకుండా పోయింది. పండగల వేళ చిన్నచిన్న కాంట్రాక్టర్లకు ప్రతి పండుగకు చెల్లించాల్సిన పేమెంటు ఈ సంవత్సరం ఎందుకు చెల్లించడం లేదు. కమిషన్లు ఇచ్చిన వారికి మున్సిపల్ దగ్గర డబ్బులు ఉంటాయి… ఇవ్వని వారికి మునిసిపల్ లో డబ్బులు ఉండవు. పండగ వేళ లేబర్ కు… ఇతర బిల్లులు చెల్లించలేక చిన్నచిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు వారికి అండగా నిలవాలి. నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిపై కాంగ్రెస్ నాయకులు చొరువచూపి… కమిషన్లకు పాల్పడుతున్న అధికారులపై విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలి. అవినీతి అధికారులపై చర్యలు తీసుకునే వరకు బిఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తాం. అవసరమైతే సీఎం వరకు వెళ్తాం. నగరపాలక సంస్థ అకౌంట్స్ అధికారులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ చిన్నచిన్న కాంట్రాక్టర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. డివిజన్లో కార్పొరేటర్లు అత్యవసర పనులు కూడా చేయించలేని పరిస్థితుల్లో ఉన్నారు.

ఈ ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి  బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు  బిఆర్ఎస్ పార్టీ నగర మైనార్టీ అధ్యక్షులు చౌకత్  ప్రధాన కార్యదర్శి వాజిద్  55వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్  37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆరె రవి గౌడ్  29వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జెల్లోజి శ్రీనివాస్  37వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీయూత్ అధ్యక్షులు నాగుల కిరణ్ కుమార్  55డివిజన్ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు సతినేని శ్రీనివాస్  బిఆర్ఎస్ పార్టీ నాయకులు నారాదాసు వసంత రావు , నాదిమ్  పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్