రేచర్లపేటలో ప్రజావేదిక కార్యక్రమం

- Advertisement -

రేచర్లపేటలో ప్రజావేదిక కార్యక్రమం

Prajavedi program in Ratcherlapet

కాకినాడ
ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాకినాడ  రేచర్ల పేట లో 4, 5, 6, 7, 8, 33 డివిజన్ల సంబంధించి ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ  గత వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం అస్తవ్యస్త పాలనతో గాడి తప్పిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి  ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వంగా ప్రజల మనసులు చూరగొంటుందని, వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు కొండబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అధికారులు కూటమి నాయకులు మల్లిపూడి వీరు, SK రహీమ్, అంబటి చిన్న, గుజ్జు సూర్యావతి లక్ష్మణరావు, మమతా శ్రీనివాస్,  సీకోటి అప్పలకొండ, సంగిశెట్టి అశోక్, పోలిపల్లి జగన్, బంగా నాగరాజు, వానపల్లి పోలీసు, ఏడిది కృష్ణ, కొల్లు కుమారి, వడిసెల దానమ్మ, వీరంరెడ్డి వెంకటలక్ష్మి, ఓం నమశ్శివాయ, బొచ్చా దాసు, చిట్నీడి ధారా ప్రసాద్, వీరంరెడ్డి శ్రీనివాస్, పి. దయామని, వానపల్లి జ్యోతి, బొడ్డిపల్లి నాని,  బత్తుల భవాని, బత్తున ఉమాదేవి, లక్ష్మణరావు, బొంతు సత్యనారాయణ ప్రసాద్, ఏడిద శ్రీను, నాగేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular