- Advertisement -
దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం మంత్రి ఆనం
Minister Anam will successfully conduct the Dussehra celebrationsవిజయవాడ
దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. వీఐపీలకు ప్రత్యేక టైమ్ స్లాట్ వుంటుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ , మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ వీఐపీల టైమ్ స్లాట్లు ఏర్పాటు చేసాం. వృద్ధులకు , దివ్యాంగులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ దర్శనం టైమ్ స్లాట్. 500 రూపాయలు తీసుకున్న వారికి కూడా అంతరాలయం వెలువల నుంచే దర్శనం వుంటుంది. మొదటి రోజు ఉదయం 9 గంటలకు దర్శనాల ప్రారంభమవుతాయి. 13 శాఖల సమన్వయంతో ముందుకు వెళతాం . ఉత్సవాలకు ఘాట్ రోడ్డును అందుబాటులోకి తెస్తాం. వీఐపీల కోసం ప్రత్యేకంగా హోల్డింగ్ ఏరియాలు ఏర్పాటు చేశాం. వీఐపీల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశాం. ఆ వాహనాల్లోనే వీఐపీలను దర్శనానికి తీసుకువెళ్లి తీసుకొస్తాం. పవిత్రసంగమం ఘాట్ లో పవిత్రహారతులను పునరుద్ధరిస్తామని అన్నారు.
- Advertisement -




