- Advertisement -
హైడ్రాకు హైపవర్
విస్తృతాధికారాలు ఇచ్చిన ప్రభుత్వం
ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్
Highpower to Hydra
హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు మంగళవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇటీవల ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. వాటిని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిశోర్ నివృత్తి చేయడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
- Advertisement -



