- Advertisement -
ఆమానవీయంగా ప్రవర్తిస్తున్న రేవంత్ ప్రభుత్వం
Revanth Govt who is behaving in-humanely
హైదరాబాద్
మహాత్ముడు గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా తెలంగాణ భవన్లో వారి చిత్రపటాలకి పూలమాలలు వేసి భారత రాష్ట్ర సమితి కేటీఆర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు నివాళులు అర్పించారు.
కేటీఆర్ మాట్లాడుతూ తన సత్యాగ్రహంతో భారతజాతినే కాకుండా ప్రపంచాన్ని మేల్కొల్పిన గొప్ప మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమందికి స్ఫూర్తినిస్తూ అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ జన్మ దిన శుభాకాంక్షలు. సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని, ఆ సమాజం, ఆ ప్రభుత్వం ఎట్లా ఆదరిస్తున్నదనే దాన్నిబట్టి ఆ ప్రభుత్వం యొక్క వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుందని మహాత్మా గాంధీ స్వయంగా చెప్పారు. ఈ మాట సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నదని అన్నారు.
సమాజంలోని బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుంది ఈ అంశంలో పునరాలోచించుకోవాలి. రాష్ట్రంలోని ప్రజలు పేదలంతా బాధపడుతున్నారు. ఇండ్లు కూల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కూలీలు కూడా ఇల్లు కూలగొట్టలేమంటూ మాతో తిరిగి వెళ్ళిపోయారు. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది నిర్మాణాత్మక పనులు చేయమని కానీ విధ్వంసం సృష్టించమని కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలి . మేము రెండున్నర లక్షల ఇండ్లు కడితే మిమ్మల్ని అయిదు లక్షల ఇల్లు కట్టమని ఓటేసినారు కానీ ఉన్న ఇండ్లను కూలగొట్టమని కాదు. కానీ సమాజంలోని అత్యంత వెనుకబడిన వారిపట్ల కర్కషంగా అమామానవీయంతో వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ సర్కారు తీరు బాధాకరమని అన్నారు.
ఈ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత గాంధీలు ఈ ప్రభుత్వ అమానవీయమైన పాలనపై స్పందించాలి. డి పి ఆర్ అనేది లేకుండా ఇండ్లు కులగొట్టే దుర్మార్గమైన ప్రయత్నాలను విరమింపచేయాలి. మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
- Advertisement -