Thursday, May 7, 2026

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది

- Advertisement -

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది

Law and order in the state has lost its groove

కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
పులివెందుల
కూటం ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచక పాలన నడుస్తుంది. వంద రోజుల పాలనలో పులివెందులతో పాటు జిల్లా వైసిపి నేతలపై దాడులు చేస్తున్నారని ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం అసంతృప్తి మూటగట్టుకుంది. పులివెందుల లో ఇష్టానుసారం మట్కా, జూదం నడిపిస్తున్నారు. గత వంద రోజుల్లోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి నడి రోడ్డు పై కొట్టుకుంటూ టిడిపి ఆఫీస్ కు తీసుకెళ్ళారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో పులివెందుల ప్రశాంతంగా ఉండేది. పులివెందుల లో అభివృద్ధి సంక్షేమం తప్ప ఇలాంటి సంసృతి లేదు. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. కూటమి ప్రభుత్వం పులివెందుల కు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. పులివెందుల లో జగన్ చేసిన అభివృద్ధి ని కొనసాగిస్తే చాలు. పులివెందుల లో ఎంతో అద్భుతంగా నిర్మించిన మెడికల్ కాలేజ్ కి అడ్మిషన్లు రాకుండా చేసింది కూటమి ప్రభుత్వం. వి కొత్తపల్లె గ్రామంలో విఆర్ఎ నరసింహ అనే వ్యక్తి ని జిలెటిన్ స్టిక్స్ పేల్చి హత్య చేశారు. ఇలాంటి ఘటనతో జిల్లాలో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. పులివెందుల విచ్చలవిడిగా డిటోనేటర్లు,జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయి. వేముల మండలం లో అక్రమ మైనింగ్ వల్ల జిలెటిన్ స్టిక్స్ లభిస్తున్నాయి. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని రెవెన్యూ అధికారులకు, జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశాం. అక్రమ మైనింగ్ అడ్డుకోవాలని వైకాపా తరపున డిమాండ్ చేస్తున్నాం. తిరుమల లడ్డు వివాదం పై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన చంద్రబాబు బురదజల్లే విధంగా మాట్లాడటం దేశ వ్యాప్తంగా చూశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులు చేయద్దని హితవుపలుకుతున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్