317 బాధితులకు న్యాయం చేస్తాం

- Advertisement -

 317 బాధితులకు న్యాయం చేస్తాం
హైదరాబాద్

We will do justice to 317 victims

గాంధీభవన్ లో 317 జీవో బాధితులతో  టిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్,  కొండ సురేఖ మాట్లాడారు. 317 జీవో పెట్టినవాడే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. కమిటీ సభ్యుడిగా చెప్తున్నా. 317 జీవో బాధితులకు అన్యాయం జరగనివ్వం. 317 జీవో బాధితుల కోసం సబ్ కమిటీ వేశాం. పలు కారణాల వల్ల సమస్య పరిష్కారం వాయిదా పడింది. కమిటీ అనేక అంశాలపై అధ్యయనం జరిగింది. గాంధీ జయంతి రోజు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. 317 జీవో సమస్య పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నాం. కమిటీ సభ్యుడు శ్రీధర్ బాబు అమెరికా వెళ్ళడం, అసెంబ్లీ సమావేశాల వల్ల కమిటీ మీటింగ్స్ అవలేదు. జీవో 317 బాధితుల విషయంలో న్యాయం చేయాలని మాకు విల్ పవర్ ఉంది. ఎవరో ఏదో చెపితే వాళ్ళ మాటలు విని కంగారు పడకండని మంత్రి పొన్నం అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular