- Advertisement -
భార్య ను గొడ్డలితో నరికి చంపిన భర్త
The husband killed his wife with an axe
నంద్యాల
నంద్యాల జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు. తన భార్యను అత్యంత పాశవికంగా హతమార్చాడు ఓ భర్త. కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు తెలిపిన వివరాల మేరకు కనకాద్రిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీపార్వతి (38), రామ్మోహన్ దంపతులు. వీరికి పెళ్లి జరిగి 19 సంవత్సరాలు అయింది ఇద్దరు పిల్లలు. త్రాగుడుకు బానిసగా మారి రామ్మోహన్, ప్రతి నిత్యం పుటుగా మద్యం సేవించి, ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరితో తరచుగా గొడవ దిగుతున్నాడు. చివరికి గత కొంతకాలంగా పార్వతి తల్లిదండ్రులతో కలిసి కనకాద్రి పల్లెలోనే ఉండింది. అయితే గత రాత్రి పూటుగా మద్యం సేవించిన కిరాతకుడు రామ్మోహన్ ఇంటికి వచ్చి భార్య లక్ష్మీపార్వతితో డబ్బులు విషయంలో ఘర్షణ పడ్డాడు. దీంతో మరింత ఆవేశానికి లోనైన రామ్మోహన్, రాత్రి నిద్రిస్తున్న భార్యను గొడ్డలితో తల భాగంపై విచక్షణా రహితంగా నరికి దారుణ హత్య చేశాడు. ఘటన స్థలంలోనే ఆమె మృతి చెందింది. అనంతరం భర్త అక్కడి నుంచి జారుకున్నాడు. మహిళ హత్య సమాచారం తెలుసుకున్న కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రామ్మోహన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
- Advertisement -



