- Advertisement -
ఒక్క ఇరిగేషన్ శాఖలోనే 18 వేల కోట్ల బకాయిలు-మంత్రి నిమ్మల రామానాయుడు
18,000 crore dues in the irrigation department alone - Minister Nimmala Ramanaiduమంగళగిరి
గురువారం నాడు మంగళగిరి టిడిపి పార్టీ కార్యాలయంలో ప్రజాదర్భార్ లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గోన్నారు. తరువాత మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ వేదింపులు,కక్ష్యల ఫలితమే,న్యాయం కోసం అర్జీలతో వస్తున్నారు. అధికారం అనుభవించడానికే కాదు,సేవ చేయడానికే అనే లక్ష్యంతో మంత్రుల సైతం ప్రజాదర్భార్ కు హాజరవుతున్నాం. గత ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టింది. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019-24మధ్య ఏపీకి ఎక్కువ నష్టం జరిగింది. కొంతమంది అధికారులు కూడా ఇంకా పాత విధానంలోనే ఉన్నారు, అన్నీ సరిదిద్దుకుంటున్నాం. ఉన్నతాధికారుల్లోనూ, వ్యవస్థలోనూ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. వైసీపీకి ఊడిగం చేసే క్రమంలో కొందరు ఉన్నతాధికారులు పనివిధానం మర్చిపోయారనిపిస్తోంది. మరుగునపడిన వ్యవస్థల్ని త్వరలోనే గాడిలో పెడతామని అన్నారు.
- Advertisement -




