- Advertisement -
పిఠాపురం లో దసరా ఉత్సవాలు
Dussehra celebrations in Pithapuramపిఠాపురం
శరన్నవరాత్రి మహోత్సవాలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి.పిఠాపురం పట్టణం మోహన్ నగర్లోగల కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించి,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాయిస్ ఓవర్:- ఈ సందర్భంగా మహిళా భక్తులు నిర్వహించిన కలశాల ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు.అనంతరం పిఠాపురం సినిమా సెంటర్ వద్ద పిఠాపురం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లోనూ,గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లోనూ మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు…
- Advertisement -




