Monday, December 23, 2024

హైదరాబాద్ – గోవా కొత్త రైలు.. వారానికి రెండు రోజులు..

- Advertisement -
హైదరాబాద్ – గోవా కొత్త రైలు.. వారానికి రెండు రోజులు.. టైమింగ్, ఆగే స్టేషన్లు, టికెట్ ధరలు ఇలా..!!*

Hyderabad – Goa new train.. two days a week..

తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది.

హైదరాబాద్ నుంచి నుంచి గోవాకు మరోరైలును అందుబాటులోకి తీసుకోస్తుంది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేందుకు.. సికింద్రాబాద్- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ను ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ రైలు వారానికి రెండు రోజులు సేవలు అందిస్తుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్ర వారాల్లో ఈ రైలు బయలుదేరుతుండగా.. గోవా నుంచి గురు, శని వారాల్లో బయలుదేరుతుంది. అయితే అక్టోబర్ 6వ తేదీన ఈ రైలు ప్రారంభం అవుతున్నప్పటికీ.. రెగ్యులర్ సర్వీసులు మాత్రం అక్టోబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తాయి.

ఇదిలాఉంటే, ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గోవాకు కొన్ని రైళ్లు ఉన్నప్పటికీ.. అందులో టికెట్లు దొరకడం కష్టమనే చెప్పాలి. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో రైల్వే శాఖ మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకోస్తుంది.

సికింద్రాబాద్- వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో స్లీపర్, థర్డ్ ఎకానమీ, త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్ బోగీ, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల జంక్షన్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్ జంక్షన్, బల్లారి జంక్షన్, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్లీ, ధార్వాడ్, , క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్‌డామ్, మడగావల్ స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్ – వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్..
>> ఈ రైలు (17039) ప్రతి బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.05 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది.

>> ఈ రైలు (17040) ప్రతి గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

టికెట్ ధరలు ఇలా..
>> సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామాకు టికెట్ ధరలు. స్లీపర్ క్లాస్‌లో రూ. 440, థర్డ్ ఎకానమీలో రూ. 1,100, త్రీ టైర్ ఏసీలో రూ. 1,185, టూ టైర్ ఏసీలో రూ. 1,700, ఫస్ట్ ఏసీలో రూ. 2,860గా ఉన్నాయి.

>> కర్నూలు టౌన్ నుంచి వాస్కోడిగామాకు టికెట్ ధరలు. స్లీపర్ క్లాస్‌లో రూ. 350, థర్డ్ ఎకానమీలో రూ. 870, త్రీ టైర్ ఏసీలో రూ. 950, టూ టైర్ ఏసీలో రూ. 1,355, ఫస్ట్ ఏసీలో రూ. 2,255గా ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్