స్వర్ణాంధ్ర-2047లో ప్రజలు భాగస్వామ్యం కావాలి

- Advertisement -

స్వర్ణాంధ్ర-2047లో ప్రజలు భాగస్వామ్యం కావాలి

People should participate in Swarnandhra-2047

అనకాపల్లి
స్వర్ణాంధ్ర-2047 తో ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామిగా అభివృద్ధి చెందాలి. 2024-2029 వరకు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. వృద్ధిరేటు పెరిగేలా ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని హోం మంత్రి అనిత అన్నారు. గత ఐదు సంవత్సరాలగా అన్ని రంగాలను నిర్వీర్యం చేసారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి జిల్లా అన్ని విధాలగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయి. 73 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. పర్యాటక,వ్యవసాయం,పారిశ్రామిక రంగాలతో జిల్లా మరింత అభివృద్ధి చెందబోతుందని అన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతలు కల్పిస్తున్నాం. చంద్రబాబు విజన్-2020 అంటే అందరు నవ్వుకున్నారు. హైదరాబాద్ ను అభివృద్ది చేసి చూపించారు. స్వర్ణాంధ్ర-2047లో ప్రజలు భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు సూచినలు,సలహాలు ఇవ్వాలి.  జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లు నుండి 11 సీట్లుకు పడిపోయారు.ఈ వందరోజుల పాలనపై మేము చర్చకు సిద్ధమని అన్నారు. సకాలంలో ఫించన్ లు ఇస్తున్నాం. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను రద్దు చేసాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం,నూతన ఇసుక విధానం తీసుకువచ్చాం. త్వరలో ఉచిత బస్సు,ప్రీ గ్యాస్ అందుబాటులోకి తీసుకువస్తాం. చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసు. జగన్ చేసిన మోసాలు బయటికి వస్తున్నాయని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular