సురేఖవి దిగజార్చుకునే వ్యాఖ్యలే

- Advertisement -

సురేఖవి దిగజార్చుకునే వ్యాఖ్యలే

Surekhavi's demeaning comments

మంత్రుల బుర్రలను ప్రక్షాళన చేయాలి
సూర్యాపేట
మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై  మాజీమంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. మూసీ కాదు ముందు మీ బుర్రలు ప్రక్షాళన చేసుకోండి రేవంత్ పాలన అగమ్యగోచరంగా ఉంది. 2014 కు ముందు తరువాత జరిగిన అభివృద్ధి అందరికీ తెలిసిందే. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీనా కదా. ప్లోరోసిస్ భూతాన్ని తరిమింది కేసీఆరా.. కాంగ్రెస్సా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తో మంచినీళ్లు తెచ్చిందేవరు. మాట్లాడే ముందు సోయితో   ఆలోచించి మాట్లాడాలి.మంత్రుల స్థాయిలో ఉండి దిగజారుడు మాటలు.. ఎవరో చెప్పినవి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేయాలన్న కొండా సురేఖ మాటలు పై మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితి పై అనుమానాలొచ్చేలా ఉన్నాయి. స్థాయిలేని వారికి మంత్రి పదవి రావడంతో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆకతాయిలు చేసిన పనులకు కేటీఆర్ కు ఎం సంబంధం. రేవంత్ వెనకాల ఉండి మంత్రులతో అవాకులు మాట్లాడిస్తున్నారు. సురేఖ మాటలు స్వంత పార్టీ నాయకులు సైతం సిగ్గుపడేలా ఉన్నాయి. హామీల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది కాంగ్రెస్. హామీలు విఫలమై హైడ్రా , హైడ్రా విఫలమై సినీ తారల అంశం తెరపైకి తెస్తున్నారు. రేవంత్ డైవర్షన్ రాజకీయాలతో కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయ్. కేసీఆర్ ని అంటే.. కొండా మురళి కనపడటంలేదని కొందరు మీమ్స్ పెడుతున్నారు. మనుషులను మాయం చేసే చరిత్ర మీది. చిల్లర మాటలు అని , అనిపించుకోవడం దేనికి. సురేఖ వి స్థాయిని దిగజార్చుకునే మాటలే.  మూసీ ప్రక్షాళనకు అడ్డుకుంటే ఉద్యమం చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ పై మాట్లాడుతూ  కోమటిరెడ్డి మానసిక స్థితి సరిగ్గాలేదు. కాంగ్రెస్ , బీ ఆర్ ఎస్ హయాంలో మూసీ స్థితి పై చర్చకు సిద్ధమా. నేటి మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్సే. మూసీ ప్రక్షాళన కాదు సీఎం మంత్రుల బుర్రలు ప్రక్షాళన చేయాలి. మూసీ మురికి కన్నా ఎక్కువ కలుషితమైన కాంగ్రెస్ ఆలోచనల సుందరీకరణ జరగాలని అన్నారు,

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular